ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడా...ఎప్పుడా.. అని ఎదురు చూసిన మహేష్ కొత్త సినిమా లోగో ట్రైలర్ “వన్” నిన్న విడుదల అయింది. “నేనొక్కడినే” అనేది ఉపశీర్షిక. అయితే ఈ లోగో పై ఒక విచిత్రమైన ప్రచారం మొదలు అయింది. ఈ సినిమా టైటిల్ లోగో కొత్తగా లేదని, దానిని ఇతర లోగోల నుంచి కొద్దిగా కాపీ కొట్టి మార్చి రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లోగో లో సూర్య “సింగం-2”, ఐపిఎల్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ,హీరో జీవా నటించిన “ఈ” సినిమా లోగోలను పోలి ఉందని వార్తలు వస్తున్నాయి.

 అంతేకాకుండా ఎంతో ఆశగా ఎదురుచూసిన మహేష్ అభిమానులను కూడా ఈ లోగో సంతృప్తి పరచలేకపోయిందనే వార్తలు వస్తున్నాయి. 30 సెకండ్స్ నిడివి గల ట్రైలర్ లో కేవలం నాలుగు షాట్స్ లో మాత్రమే మహేష్ కనిపించడం, అది కూడా కనిపించీ కనిపించకుండా మహేష్ మొహం ఉండటం ప్రిన్స్ అభిమానులను నిరాశపరచిందని టాక్. కాని మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా తమకు మహేష్ పట్ల ఉండే విరాభిమానంతో తన టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ఈ లోగోను పోస్టర్స్ గా చేసి అతికించుకొని ఆనందపడుతున్నారు అట.

ప్రిన్స్ మహేష్ మాత్రం ఈ లోగో కు, టీసర్ కు విపరీతమైన స్పందన వచ్చిందని చెపుతూ తన అభిమానులకు ఈ రోజు ట్విట్ చేశాడు. ప్రిన్స్ పుట్టినరోజు నాడు ఈ సినిమా పాటల ఆడియో విడుదల అవుతుందని దసరా పండుగకు దసరా కానుకగా ఈ సినిమా వస్తుందన్న వార్తలు మహేష్ అభిమానులను ఆనందపరుస్తున్నా ఫైనల్ సినిమా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అన్న భయం మాత్రం మహేష్ అభిమానులను వెంటాడుతుందట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: